Breaking News

రాష్ట్ర కాంగ్రెస్, నగర కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు Lop రాహుల్గాంధీ నీట్ CBSE పరీక్షల paper’s లీక్ అవటం వల్ల దేశ వ్యాపితంగా 50 లక్షల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడితే, మోడీజీ సమాధానం చెప్పటం లేదు.
రాహుల్గాంధీ దేశవ్యపీత పర్యటనలో భాగముగా ఈ రోజు రాజస్తాన్ కోటా లో మెగా ర్యాలీ గొప్ప బహిరంగ సభ జరుగుతున సందర్భములో, మేము కూడా సంఘీభావం తెలుపుతూ నగర కాంగ్రెస్ మద్దతుగా విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో ధర్నా చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని స్లొగన్స్ ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నరహరశెట్టి నరసింహారావు, కొలనుకోండ శివాజి, వీ.గురునాధం మీసాల రాజేశ్వరరావు, అన్సారీ, అల్లం రాజేష ,MD బేగ్ బుదల జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *