విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరలక్ష్మీ హోమ్ కేర్ & చారిటబుల్ ట్రస్ట్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి యువ నాయకులు బోండా సిద్ధార్థ, టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విచ్చేశారు. వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పేదవారికి, ముసలివారికి భోజన సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా ఎండ తీవ్రతల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బోండా సిద్ధార్థ,నెలిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు అందుతున్నాయని సేవా కార్యక్రమాలు పొందుతున్నారన్నారు. తమ వైపు నుంచి వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఎలాంటి సహకార సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షించారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ చైర్మన్ & జనసేన 33 వ డివిజన్ ప్రెసిడెంట్ పోకల సురేంద్రబాబు మాట్లాడుతూ వరలక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి, ట్రస్ట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో మరింత విస్తరింప చేయాలని వారికి కావాల్సిన సహాయ సహకారాలు తమ నుంచి తమ పార్టీ నాయకుల నుంచి అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలియజేశారు. అనంతరం వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన లగుడు వరలక్ష్మీ మాట్లాడుతూ తాము నిర్వహించే సేవా కార్యక్రమాలకి ప్రేరణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కూడా పేదవారికి మధ్యతరగతి వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడి వారి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అని అన్నారు. అదే స్ఫూర్తితో తాము కూడా తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు, మధ్య తరగతి వారికి తమ వంతు సాయం చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ ప్రెసిడెంట్ రహీం, 31 డివిజన్ ప్రెసిడెంట్ నల్లారి సాయినాగు, గ్రామీణ వైద్య జాతీయ పార్టీ అధినేత కొండేటి సురేష్ బాబు, కార్యకర్తలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News