-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో ఎన్డీయే కార్యాలయంలో నిరంతరం చేపడుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమం అనూహ్య స్పందనతో కొనసాగుతుంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రతి ఒక్కరి సమస్యను వింటూ పరిష్కారం చూపిస్తున్నారు.
దుర్గమ్మ గుడి పరిసరాల్లో అనధికారికంగా రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారిని ఇటీవల కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరగా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపెడతామన్నారు.. జోనల్ కమిషనర్ శ్రీనివాసరావుతో మాట్లాడి వారి వివరాలను సేకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వైద్య సహాయం వంటి అంశాలపై వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరూ ప్రజా దర్బార్ ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ అర్షద్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షురాలు పటాన్ షమీలా ఖాతూర్, 54 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తారిక్ అజీజ్, 54 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News