-డినోటిఫైడ్, సంచార, సెమీ సంచార వర్గాల జాతీయ అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యులు తురకా నర్సింహ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డినోటిఫైడ్, సంచార, సెమీ సంచార వర్గాల జాతీయ అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యులు తురకా నర్సింహ శనివారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పటమట, 11 వ డివిజన్ పరిధిలోని రెల్లీస్ కాలనీలో పర్యటించి రెల్లి కులస్థులు ఎదుర్కోను సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంలో కేంద్ర ప్రభుత్వo మరియు రాష్ట్ర ప్రభుత్వo ద్వారా ప్రవేశ పట్టిన పథకములు అమలు చేస్తున్న విధానమును తెలుసుకొని వారి పిల్లల విద్యాభివృద్ధికి, గృహ నిర్మాణానికి సంబందించిన పధకాలపై వారికి అవగాహన కల్పించారు. స్థానిక కాలనీ వాసులు తెలిపిన సమస్యలను సత్వరం పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తదుపరి 45 వ సచివాలయంను సందర్శించి అక్కడ ప్రజలకు అందుబాటులో గల సేవలు మరియు పథకముల వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో DNT లీడర్స్ తురకా రామారావు, తన్నీరు సాంబయ్య, మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, హెల్త్ ఆఫీసర్స్ డా. B.శ్రీ దేవి, డా. ఇక్బాల్ హుస్సేన్, అర్బన్ తహసీల్దారు, శానిటరీ ఇన్స్ పెక్టర్ రాయలు, సెక్రటరీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News