విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
25వ జాతీయ యువజనోత్సవాలను పురస్కరించుకొని పత్రికా సమాచార కార్యాలయం, విజయవాడ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, ఆంధ్ర ప్రదేశ్ లు సంయుక్తంగా ఈరోజు “సక్షమ్ యువ – శశక్త్ యువ” అంశంపై వెబినార్ నిర్వహించాయి. సందర్భం గా పత్రికా సమాచార కార్యాలయ౦ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్, ఏ.డి.జి (రీజియన్) వి. రవి రామకృష్ణ ఈ వెబినార్ కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ యువత స్వశక్తి తో, ఆత్మ నిర్భరతతో ఎదగాలనేదే ప్రధాని ఆకాంక్ష అని అన్నారు. తదనుంగా కేంద్ర ప్రభుత్వం వివిధ స్టార్టప్ లను ప్రోత్సహిస్తూ యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణని అందించే పలు కార్యక్రమాలను అమలు పరుస్తోందని అన్నారు.
ఈ వెబినార్ కు ముఖ్య అతిధిగా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచలకులు శ్రీ జాకబ్ ప్రసన్న మాట్లాడుతూ యువతలో జాతీయ భావాలను పెంపొందిచడం ద్వారా మాత్రమే జాతినిర్మాణం సాధ్యపడుతుందని అన్నారు. భిన్నత్వం లో ఏకత్వం భారత దేశ విశిస్టత అని, దేశ జనాభాలో అధిక శాతం గా ఉన్న యువత లో సామాజిక సాంస్కృతిక చైతన్యం కల్గించి తద్వారా సమైక్యత భావాన్ని పెంపొందించే విధంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఎంతో కృషి చేస్తోందని అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పుదుచ్చేరిలో జనవరి 12న 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ వెబినార్ లో రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ అధికారులు, వాలంటీర్లు, పత్రికా సమాచార కార్యాలయ౦ విజయవాడ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News