-ఖాజా బాబా ఆశ్రమంలో బోండా ఉమా ప్రత్యేక ప్రార్థనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత సామరస్యానికి ప్రతీక శాంతికి చిహ్నం నినాదంతో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు సర్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోండా ఉమ ను ఇస్లాం సంప్రదాయం ప్రకారం సాధరంగా మందిరంలోకి ఆహ్వానించి ,వ్యవస్థాపక ధర్మకర్త ఉమర్ ఖాన్ సత్కరించారు. ఇటీవలే అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలు ముగిసిన తరుణంలో ఆశ్రమాన్ని సందర్శించడం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని బోండా ఉమామహేశ్వర రావు తెలిపారు. అల్లాహు ఆశీస్సులతో, ఖాజా బాబా కరుణాకటాక్షాలతో త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గతంలో మాదిరిగానే ముస్లిం మైనార్టీ సోదరుల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరుగుతుందని చెప్పారు. ఖాజా బాబా దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆశ్రమం వార్షికోత్సవ వేడుకలో వాలంటీర్లుగా విధులు నిర్వహించిన యువకులను, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను బొండా ఉమా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ, టిడిపి నాయకులు ఘంటా కృష్ణ మోహన్, తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షుడు కంచి ధన శేఖర్, చల్లగాలి అనిల్ కుమార్, తంగిరాల కొండలరావు, జగన్నాథం సాంబశివరావు, నాగిరెడ్డి, బాజీ, వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ కే. రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News