Breaking News

ముగిసిన మేడారం మహాజాతర…

మేడారం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడ్కోలు పలికారు. సమ్మక్క చిలుకల గుట్టకు, సారామ్మల కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనగొండ్ల బయలుదేరారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల ప్రవేశం సందర్భంగా కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు. ఆ తర్వాత గద్దెల వద్ద దర్శనాలను పునరుద్ధరించారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర వైభవోపేతంగా సాగింది. ఈసారి 1.30కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *