
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ జిల్లా కడప నగరంలో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇనిస్టిట్యూట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఆపరేషన్ ధియేటర్స్, 150 పడకల బ్లాకుతో పాటు వివిధ విభాగాలను సీఎం వైయస్.జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైయస్.అవినాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News