పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో, అనంతరం తాడువాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కాలనీని సందర్శించడం జరిగింది. మంగళవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించి ఇరిగేషన్, మెగా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం ప్రాజెక్ట్ స్పిల్ వే ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి ఓ.ఆనంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News