Breaking News

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలన…


పోల‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త :
పోల‌వ‌రం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామ‌ని ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న శుక్ర‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో క‌లిసి పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం పోలవరం ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీ సందర్శించి నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తొలుత 1970 దశకంలోనే ప్రతిపాదించినా, పనులు మాత్రం దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ముందుకు సాగాయి. అయితే దురదష్టవశాత్తూ దాదాపు 50 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ పనులు చేస్తుందని ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం, ఆ తర్వాత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మేము మా మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రాజెక్టును పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం అన్ని విధాలుగా కలిసి పనిచేస్తోంది. ఇటీవలే సీఎం వైయస్‌ జగన్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఇరువురి మధ్య పోలవరం ప్రాజెక్టు గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రాజెక్టును నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తాం. ప్రాజెక్టు తొలి దశను ఏడాదిలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రం కూడా చిత్తశుద్ధితో పని చేస్తోంది. అలాగే నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేస్తాం. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి పునరావాస కాలనీల్లో అని సదుపాయాలు కల్పిస్తాం. వారు ఆ కాలనీల్లో సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. వారు ఆ కాలనీల్లో మంచి జీవితం గడిపేలా, వీలైనంత త్వరగా కొత్త ప్రదేశంలో స్థిరపడేలా చూస్తాం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. అనంతరం ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ ముఖాముఖి నిర్వహించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామన్న మాట బెట్టుకుంటామని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ రోజు తాడవాయిలో దాదాపు 3905 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణ పనులన్నీ చక,చకా పూర్తవుతున్న వాతారవరణం చూస్తున్నాం. ఇదంతా చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తోంది. పోలవరం కోసం సహకరించిన ప్రతి నిర్వాసితుడికి కూడా ఒక మంచి ఇళ్లు ఇవ్వడం, వాళ్లను అన్ని రకాలుగా బాగా చూసుకోవడం… జరుగుతుంది. అన్ని రకాలుగా ఇది గొప్ప ప్రాజెక్టు అవుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాను. మరీ ముఖ్యంగా ఇక్కడ లైవ్‌లీహుడ్‌ ట్రైనింగ్, మరియూ ఎంప్లాయిమెంట్‌కి సంబంధించి ఏదైనా అవకాశాలు చూడాలి అని చెప్పి వినతులు వస్తున్నాయి. ఇక్కడికి రాకమునుపే షెకావత్‌ తో ప్రస్తావించడం జరిగింది. ఆయన కూడా దీనిపై సానుకూలంగా ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక కార్యాచరణ చేసి జీవనోపాధికి ఇక్కడ ఏదైనా మార్గాన్ని చూపిస్తామని కచ్చితంగా చెపుతున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఉదయం ఆర్‌ ఆండ్‌ ఆర్‌ కాలనీలో తిరిగినప్పుడు చెప్పినట్టుగా… కొన్ని కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సహాయం చేస్తామని చెప్పాం. ఈ 6.8 లక్షల రూపాయలను రూ.10 లక్షలు చేస్తామని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. అదే మాదిరిగా గతంలో నాన్న హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ కోసం అప్పట్లో లక్షన్నర రూపాయలకే ల్యాండ్‌ ఇచ్చిన రైతులందరికీ కూడా రూ.5 లక్షలు వరకు తీసుకుని పోయి ఆ డిఫరెన్స్‌ అమౌంట్‌ రూ.3.50 లక్షలు కూడా వాళ్లకిస్తామన్నమాట నాకు గుర్తింది.. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కచ్చితంగా చేస్తామని మనస్ఫూర్తిగా భరోసా ఇస్తున్నాం. మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కతజ్ఞతలు అని సీఎం వైయస్‌ జగన్‌ తాడువాయిలో తన ప్రసంగం ముగించారు.

ఈ పర్యటనకు హాజరైన డిప్యూటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, జి.మాధవి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్ కుమార్‌, ఐ అండ్ పీఆర్‌ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్‌ అయ్యర్‌, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *