Breaking News

జాతీయస్థాయి 11వ కథానాటిక, స్వీయనాటిక రచనల పోటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నాటక రంగ వికాసం కోసం ఉద్యమిస్తూ తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారు గత 10 సం||లుగా ప్రతి ఏటా నాటిక రచనల పోటీలు నిర్వహిస్తూ బహుమతులతో ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో తెలుగు కళాసమితి జాతీయస్థాయి 11వ కథానాటిక స్వీయనాటిక రచనల పోటీలు నిర్వహిస్తున్నామని స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు కళాసమితి అధ్యక్షులు శ్రీ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రచనలు సందేశాత్మకంగా ఉంటూ తెలుగు ప్రజల సమక్షంలో జనరంజకంగా ప్రదర్శింపబడి తెలుగు నాటక సమాజాల వారికి ఈ రచనలు తోడ్పడాలని మా తెలుగు కళాసమితి ఉద్దేశ్యమని అని అన్నారు. అనంతరం తెలుగు కళాసమితి కార్యదర్శి వై.యస్.కె.యన్. స్వామి మాట్లాడుతూ ఈ పోటీలలో ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు, కథానాటిక మరియు స్వీయరచనలు తెలుగులో మాత్రమే ఉండాలి. రచనలు 45ని॥ల నుండి 60 ని॥ల లోపు ప్రదర్శితమయ్యేంత నిడివి కలిగి ఉండాలి. అనువాదం, అనుసరణ కాదని ఆకాశవాణి, దూరదర్శన్లలో రికార్డు చేయబడలేదని హామీపత్రం జతపరచాలని అని అన్నారు. తెలుగు కళాసమితి గౌరవ సలహదారుడు విజయగోపరాజు మాట్లాడుతూ ఈ పోటిలలో గెలుపొందిన వారికి బహుమతులు వివరాలు తెలుపుతూ నాటిక రచనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 20,000/-, 15,000/-, 10,000/- రూలు అందజేయబడతాయని అదేవిధంగా పోటిదారులు రచనలు పంపుటకు ఆఖరి తేది: 25-04-2022. సందేహాలు కు మా ఫోన్ నెంబర్లు 9247333482, 9666817969 (వాట్సాప్ మాత్రమే) సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు కళాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *