Breaking News

టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు,Ex.MLA బోండా ఉమామహేశ్వరరావు  పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతి అభివృద్ధి లో తమ పాత్ర పోషిస్తూ.. భాగస్వామ్యమవుతోన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. మహిళల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉండేలా చేసి ఆడపడుచులకు అండగా ఉన్న విషయం గుర్తు చేసారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత తోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మి..వారి అభివృద్ధికి కృషి చేసారు అని తెలిపారు. కానీ ఈనాడు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో మహిళల పరిస్థితి దినదిన గండంగా మారింది అని, మహిళల పై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. ఇక పేద, మధ్య తరగతి మహిళల జీవితం దుర్భరంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి అని, ధరల స్థిరీకరణ అన్న జగన్… ఎందుకు చర్యలను తీసుకోలేదు అన్నారు.. జగన్ చేతకాని తనం వల్లే నిత్యావసర వస్తవుల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి అని, ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సిన మహిళా దినోత్సవాన్ని ఎపిలో ఆడపడుచులు ఆందోళనతో, కన్నీళ్లతో జరుపుకునే స్థితికి జగన్ తెచ్చారు అన్నారు. అన్నగా అండగా ఉంటానని నమ్మబలికి… అక్కచెల్లెళ్లను మోసం చేశాడు అని మండిపడ్డారు. విసిగిపోయిన ప్రజలు జగన్ ను సాగనంపేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, దాసరి ఉదయశ్రీ, లబ్బ దుర్గ, సందిరెడ్డి గాయత్రీ, దాసరి జయరాజు, లబ్బా వైకుంఠం, మోతుకూరి కాసిం, భవాని, కోలా శ్రీను, ఉదయ్ శంకర్, సాయి, ధన శేఖర్, మల్లేశ్వరరావు,బెవర సూరి, చల్లగాలి డేవిడ్,గడ్డం రాజు, బత్తుల రామకృష్ణ, చౌదరి సూర్యనారాయణ, కారణం రమణ, కర్రీ రమణ కుమారి, బేబీ సరోజినీ, సుజాత, శివకుమారి, దుర్గ, రవణమ్మ, జ్యోతి, పడమటి రామకృష్ణ, గార్లపాటి విజయ్, దొంగర ఆంజనేయులు, అంగిరేకుల రాంబాబు, అవనిగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *