


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజుకి టూ వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ గా దూసుకు వెళ్తున్న పద్మజా సుజుకి వారి నూతన టూ వీలర్ షోరూం ను సింగ్ నగర్ లో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పద్మజా సుజుకి ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో నెలకొల్ప గా వరుసగా భారతదేశంలో అగ్రశ్రేణి డీలర్ గా నిలిచిందని, రికార్డ్ సేల్స్ సాధించడమే కాకుండా కస్టమర్స్ ను సంతృప్తి పరచటంలో కూడా నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి టూవీలర్ కొనుగోలుపై మూడు వేల విలువగల ఎక్ససరీలు ఉచితంగా అందిస్తున్న ట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మజా సుజుకి సీఈఓ అనురాధ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News