విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరాముని జీవితం అందరి జీవన గమనానికి తారకమంత్రం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ప్రకాష్ నగర్లోని హరిహర క్షేత్రంలో త్రినాధ్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, రాజుగా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. మనిషి ఎలా జీవించాలి, సమాజంలో తన ధర్మాలను ఎలా నిర్వర్తించాలన్నది రామాయణం చెబుతుందన్నారు. తన జీవితం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సర్వ మానవాళికి ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక వెలుగులను అందించారన్నారు. తండ్రి మాటని జవదాటని రామయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, నాయకులు అలంపూర్ విజయ్, ch. రవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News