Breaking News

డ్వాక్రా మహిళలకు చేయూత….

-మూడవ విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద జిల్లాలో 35,799 సంఘాలోని 3,68,116 మంది సభ్యులకు రూ.38.49 కోట్ల పంపిణీకి రంగం సిద్దం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 35,799 స్వయం సహాయక సంఘాలోని 3,68,116 మంది సభ్యులకు రూ. 38.49 కోట్లు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న బుణాలను సక్రమంగా తిరిగి చెల్లించేందుకు వారిపై పడిన వడ్డి భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ‘‘వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ’’గా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా మరింత రుణం పొంది, వారు స్థాపించుకున్న చిన్న తరహా వ్యాపారాలు, లాభాదాయకంగా వడ్డీ బారం లేకుండా నిర్వహించుకునేందుకు తద్వారా మెరుగైన జీవనం సాగించడానికి దోహదపడుతుందని కలెక్టర్‌ తెలిపారు. మూడవ విడతలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ నగదు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కానున్నదన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలోని 4,903 స్వయం సహాయక సంఘాల 50,206 సభ్యులకు రూ.4.46 కోట్లు, మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలలోని 7,988 స్వయం సహాయక సంఘాల 82,304 సభ్యులకు రూ.6.34 కోట్లు, నందిగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలలోని 5,750 స్వయం సహాయక సంఘాల 59,620 సభ్యులకు 5.03 కోట్లు, తిరువూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలలోని 5,980 స్వయం సహాయక సంఘాలలోని 63,774 సభ్యులకు 5.14 కోట్లు, విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గంలోని 11,178 స్వయం సహాయక సంఘాల 1,12,212 సభ్యులకు రూ. 7.52 కోట్లు, మొత్తంగా 38.49 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *