
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ మైనారిటీ నాయకులు, ‘‘ఐజా గ్రూప్’’ చైర్మన్ షేక్.గయా జుద్దీన్ (ఐజా) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘‘రంజాన్ తోఫా’’ పంపిణీ కార్య క్రమం ఆదివారం భవానీపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ 1000మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌తోఫా పంపిణీ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
పండగ నాడు ఆనందంగా ప్రాంతాన్ని చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్య క్రమం ఏర్పాటు చేశామని, క్రిస్మస్, సంక్రాంతి కూడా ఇదేవిధంగా కానుక పంపిణీ చేశామని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సమస్యలపై మహేష్ నిరంతరం పోరాడుతున్నారని రాబోయే ఎన్నికల్లో వారిని ముస్లిం మైనారిటీలు ఆశీర్వదించాలని కోరుతూ, విజయవాడ నగరం లోని ముస్లింలు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథి నగర అధ్యక్షులు పోతిన వెంకటమహేష్ మాట్లాడుతూ ఓటమితర్వాత కూడా నిరంతరం ఈప్రాంతంలో గయాజుద్దీన్ సేవాకార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని ప్రజలు కూడా మంచి వారెవరో ముంచె వారెవరో గ్రహించాలని, ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీని కేవలం ఓటుబ్యాంకు చూస్తూ వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఖురాన్ సాక్షిగా ముస్లిం మైనారిటీలను జగన్మోహన్‌రెడ్డి మోసంచేశారన్నారు.
మేనిఫెస్టోలో పెట్టిన ఏఒక్క అంశాన్ని అమలు చేయలేదని పేద ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహ సమయంలో లక్షరూపాయలు ఇస్తానని చెప్పి నేటివరకు ఒక్కరు కూడా అంద చేయలేదని, ముస్లిం కుటుంబాల్లో ఎవ రైనా మరణిస్తే ఐదు లక్షలరూపాయల పరిహారం అందజేస్తామని చెప్పి ఒక్క రికి కూడా ఇవ్వకుండా మోసం చేశారని, వక్ఫ్‌బోర్డ్ స్థలంను రీ సర్వే చేయించి డిజిటలైజేషన్ చేయలేదని, పంజాసెంటర్‌లోని ముసఫిర్ఖాన వక్ఫబోర్డ్ పరిధి లోనే ఉంచి పేదముస్లింలకు ఐదువేలకే అద్దెకుఇవ్వాలని, హజ్‌హౌస్‌ను భవానీ పురంలో నిర్మాణం చేయాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ముస్లిం మైనార్టీల ద్రోహి ప్రభుత్వం అనక తప్ప దన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన నాయకులు నాయుబ్ కమల్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News