Breaking News

వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేసి, వారి సేవలను కొనియాడిన మాజీ మంత్రి పేర్ని నాని


-గ్రామాల్లో త్రాగు నీటి సమస్యలు, ఇతర సమస్యలపై ఆరా తీసిన పేర్ని
-మండలంలో త్రాగు నీటి సమస్యలపై పరిష్కార చర్యలు తీసుకోవాలి
-ఎక్కడైనా వాలంటీరు పదవి ఖాళీ అయితే నెలలోగా భర్తీ చేయాలి-అధికారులకు ఆదేశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీమంత్రి బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని గురువారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బందరు మండలం లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని సత్కరించి సేవా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా పేర్ని మాట్లాడుతూ నిస్వార్ధంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ గా మీరు అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. వెలకట్టలేని మీ సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గౌరవ పురస్కారమని అన్నారు.
జిల్లాలో నెల మొదటి తారీఖునే తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వృద్ధులను పలకరించి పింఛన్లు పంపిణీ చేస్తూ బందరు మండలాన్ని ఎప్పుడు జిల్లాలో మొదటి స్థానంలో నిలుపుతూ, రాష్ట్రస్థాయిలో టాప్ ఫైవ్ లో నిలబెడుతున్నoదుకు 370 మంది వాలంటీర్లతోపాటు, బందరు మండలంలోని 210 మంది సచివాలయ సిబ్బందిని కూడా మంత్రి సత్కరించి మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. గ్రామాల వారిగా త్రాగునీటి సమస్యలు వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు తమ పరిధిలో ఇళ్ళను వారంలో ఎన్ని సార్లు సందర్శిస్తున్నారు? ప్రజలు మిమ్మలను ఏవిధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? శాసనసభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా వాలంటీర్లకు తెలియజేస్తారని, సమస్యలను సంబంధిత సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్లు తమ పరిధిలో ప్రజలతో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని తద్వారా మీకు మర్యాద గౌరవం ఇస్తారన్నారు.
సుల్తానగరంలో వాలంటీరు మరణించిన కారణంతో, మరోచోట రిజైన్ చేసిన కారణంగా ఖాళీ కాగా మరొకరికి బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల పేర్ని అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఏదైనా కారణాలతో వాలంటీర్ పదవి ఖాళీ అయితే నెల రోజుల్లోగా భర్తీ చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చిన్నాపురంలో డ్రైనేజీ సమస్య, అక్కడక్కడ తాగునీటి సమస్యలు శాసన సభ్యులు వారి దృష్టికి తేగా, అధికారులు తాగునీటి పథకాలు తనిఖీచేసి వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరిసేపల్లి, సుల్తానగరంలో నీరు ఆకుపచ్చగా వస్తున్నదని తెలుపగా, కాపర్ సల్ఫేట్ తగుమోతాదులో కలిపి ఈ సమస్య పరిష్కరించాలని సూచించారు.
మత్స్యకార భరోసా పథకం వివరాలు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మత్స్యకార భరోసా క్రింద 10,954 మంది అర్హులు కాగా, వీరికి మే 11వ తేదీన ముఖ్య మంత్రి మత్స్యకారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నారని తెలిపారు. ఈ పథకం కింద వివిధ కారణాలతో 896 మంది అనర్హులుగా ఉన్నారని, ముఖ్యంగా భూమి లేని వారికి ఉన్నట్లుగా చూపడం తదితర గ్రీవెన్స్ పరిశీలించి నవశకం సైట్లో కరెక్షన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్పర్సన్ నాగలక్ష్మి భవాని, జడ్పీ సీఈఓ పి ఎస్ సూర్య ప్రకాష్, డ్వామా పిడి జి వి సూర్యనారాయణ, తాసిల్దార్ డి సునీల్ బాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి లంకే వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *