Breaking News

బీసీల సంపూర్ణభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని,వారికి రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలబడిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ లో కాటూరి వారి వీధి మరియు హై స్కూల్ రోడ్ నందు ‘గడప గడపకు వైస్సార్సీపీ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్,కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తో కలిసి అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసి టీడీపీ ప్రభుత్వం వాడుకొంది అని,కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారికి రాజకీయ గుర్తింపు ఇచ్చారని వారి ఆర్థికాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని తెలిపారు. దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఏవిధముగా చేయలేదని అందరికి జగన్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు.కేవలం రాజకీయ మనుగడ కోసమే టీడీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు ఎవరు వారి చిల్లర రాజకీయాలు విశ్వసించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురుంచి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి షో రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నే కోట్ల రూపాయలు వెచ్చించి తూర్పు నియోజకవర్గ అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ కార్పొరేటర్ పల్లెం రవి,వైస్సార్సీపి నాయకులు sk సుబాని,ఎన్. ఎస్.రాజు,శర్మ,రఫీ,మల్లి,పుప్పాల వెంకట్,గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *