
-ఆర్యవైశ్య భవనం నిర్మాణం గురించి టీడీపీ చేసే దుష్ప్రచారం మానుకోవాలి- మాజీ మంత్రి వెల్లంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక గాంధీనగర్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహా సభ అద్వ్యర్యంలో నిర్మించబోతున్నా భవనానికి ఆదివారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఆర్యవైశ్య భవనం వుండేది నేడు రాష్ట్రం విడిపోయాక ఆర్యవైశ్యలుకు భవనం లేదని నేడు ఆ భవన నిర్మాణనికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ భవనంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఆర్యవైశ్యలకు వుండాటనికి రూమ్స్,కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ భవనం నిర్మాణం విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేయడం సబబు కాదన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ లో ఆర్యవైశ్యలు ఎవరు లేరన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ భవన నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాల గిరి, మహా సభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్, రేపాల శ్రీనివాసరావు, గుబ్బా చంద్ర శేఖర్, పెనుగొండ సుబ్బారాయుడు, గున్నంసెట్టి,కనకరాజు, నాగ బాబు,పోతుల సురేష్, కొనకళ్ల విద్యధరరావు, కొండపల్లి బుజ్జి మరియు తదితర ఆర్యవైశ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News