Breaking News

అమ్మ ఓ అద్బుతం… : మహమ్మద్ హజీరాబేగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూకాల్లో కొలవలేనిది పంచేకొద్దీ తరగనిది అమ్మ ప్రేమ అని,అమ్మేలేకుంటే ఈ సృష్టేలేదని ఆ అమ్మను కాపాడుకోవలసిన గురుతర బాధ్యత మనందరిదని, ఆది గురువు అమ్మేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ హజీరాబేగం ఉద్బోధించారు. ఈరోజు సంఘ కార్యాలయంలో అంతర్జాతీయమాతృ దినోత్సవ సమావేశంనకు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఆశాజ్యోతి అధ్యక్షత వహిస్తూ అమృతం లాంటి ప్రేమను కురిపించేది అమ్మ అని ప్రపంచంలో కల్మషం లేని ఒకే ఒక వ్యక్తి అమ్మ అని నిన్ను ఈ సమాజానికి పరిచయం చేసేది అమ్మ ఆమె ఒక అద్భుతం అని అని నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆశాజ్యోతి తెలియజేశారు. సంఘ కార్యాలయంలో మాతృ దినోత్సవం కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం బి.శిరీష,జి,నాగలక్ష్మి, టి.పవిత్ర,వి.లక్ష్మీ, జి.పద్మ, మాతృమూర్తులందరికి ఘంనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు, టి.విజయకుమార్, మాకినేని మురళి, సుబ్బరాయుడు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *