అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతో పాటు విద్యా వికాసానికి కావలసిన ఆటపాటలను కూడా నిర్వహించాలని అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు వివిధ దేశ నాయకుల వేషధారణ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్సీ కాలనీ నందు కళ్యాణ మండపంలో ఈ అంగనవాడి వార్షికోత్సవాలు కొండపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను సరైన సమయానికి అంగన్వాడి కి పంపించాలని, ఇప్పటి నుండే సమయపాలన, క్రమశిక్షణ నేర్పించటం వలన భవిష్యత్తులో మంచి విద్యావంతులు గా తయారవుతారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, నాగరాజ కుమారి, నాగేశ్వరరావు, దయా సాగర్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్స్ కే. శాంతి, నిర్మల కుమారి, శ్రీదేవి, అరుణ, సబిత, జ్యోతి కుమారి, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News