Breaking News

చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ గా డా.బాబు శ్రీనివాసన్

-విధుల నుండి రిలీవ్ అయిన డా.జి.గీతబాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఇన్ ఛార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా డా.బాబు శ్రీనివాసన్. సినియర్ మెడికల్ ఆఫీసర్ & బయాలజిస్ట్ i /c డా.జి.గీతబాయి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ నుండి భాద్యతలు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతబాయి, కృష్ణ జిల్లా DM & HO గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అనుసరించి నేడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ భాద్యతల నుండి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు ఆమెకు పుష్ప గుచ్చాలు అందించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంలో విధి నిర్వహణలో వారు చేసిన కృషి, పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుదల, జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకొనుటలో వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమములో హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, డా.రామ కోటేశ్వరరావు, డా.శ్రీదేవి, వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా.రవిచంద్, శానిటరీ సూపర్ వైజరులు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *