-ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో తుపాను / వరదలు హెచ్చరిక సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్దప్రాతిపధికన వాటిని పరిష్కరించుకోనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. అసని తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు మరియు గాలులు వీచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇచ్చిన హెచ్చరికలను దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు అసిస్టెంట్ కమిషనర్ III యం.రాజ్ కుమార్ సెల్ నెం.9866514147 పర్యవేక్షణలో 3 షిఫ్ట్ లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కమిషనర్ వివరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తుఫాన్ ప్రభావం కారణంగా నగర పరిధిలో ఎక్కడైనా రోడ్లపై నీటి నిల్వలు, త్రాగునీటి పైపు లైనులు లీకులు రిపైర్లు, సీజనల్ వ్యాదులు, చెట్లు విరిగి పడిపోవుట, కొండ రాళ్లు జారిపడుట, డ్రెయిన్స్ / కాలువలు పొంగిపోర్లుట వంటి సమస్యకు ఎదురైనచొ సమస్యలను నేరుగా వాట్సప్ నెం 8181960909, ల్యాండ్ లైన్ నెం. 0866-2424515 లేదా టోల్ ఫ్రీ నెం. 18004252000 లకు కాల్స్ చేసి సమస్యలను తెలియజేసిన యెడల కంట్రోల్ రూమ్ సిబ్బంది సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ తెలియజేసారు.
Prajavartha Online Telugu News