Breaking News

గంపలగూడెం మండలం నరుకుళ్లపాడు గ్రామంలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

-భూముల రీసర్వే వేగవంతం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు అధికారులను ఆదేశించారు.
తిరువూరు డివిజన్‌ రెడ్డిగుడెం మండలం నరుకుళ్లపాడు గ్రామంలో జరుగుతున్న వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సర్వేయర్లతో కలెక్టర్‌ సమావేశమై రీసర్వే పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా ఎన్‌టిఆర్‌ జిల్లాలో 16 గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతుందన్నారు. వీటిలో జగ్గయ్యపేట మండలం షెర్‌ మహమ్మద్‌పేట్‌ గ్రామంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని విస్సన్నపేట మండలం చంద్రుపట్ల కొండూరు మండలం మారేపల్లి, కంచికచర్ల మండలం పరిటాల, తిరువూరు మండలం వాముకుంట్ల,గ్రామాలలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌, డేటా ఏంట్రీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తి అయిన గ్రామాలలో తిరువూరు మండలంలో ఆంజనేయపురం, ముష్టికుంట్ల, చిట్యాల, గంపలగూడెం మండలంలో రాజవరం, గంపలగూడెం, వినగడప, హనుములంక గ్రామాలు. ఎల్‌పియంఎస్‌ జనరేషన్‌ ఉన్న వాటిలో తిరువురు మండలంలో ఏ కొండూరు మండలంలో విసన్నపేట గ్రామాలు ఉన్నాయని వివిధ స్థాయిలో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

నరుకుళ్లపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మీక తనిఖీ…
నరుకుళ్లపాడు గ్రామసచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మీకంగా తనిఖీ చేసి స్పందన ఆర్జీల పరిష్కారానికి సంబంధించిన రిజిస్ట్రర్లను, సిబ్బంది హాజరు పట్టి, మూమెంట్‌ రిజిస్ట్రర్లను, పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యతతో కూడిన సేవలందించాలని కలెక్టర్‌ కోరారు. గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పారిశుద్ద్య కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా తీశారు.

ఎఎన్‌యమ్‌ సుమతి సేవలను ఆదర్శంగా తీసుకోండి…
నరుకుళ్లపాడు గ్రామంలో ఎఎన్‌యమ్‌గా పనిచేస్తున్న సుమతి సేవలను కలెక్టర్‌ ప్రసంశించారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య ఆరోగ్య సేవలను నూరు శాతం అందింస్తున్నారన్నారు. కోవిడ్‌ నిబంధలను పాటించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయండంతోపాటు కోవిడ్‌ టీకాలను వేయిండంలోను ప్రత్యేక శ్రద్ద వహించి ప్రజలకు చేరువుగా ఉండడం, ఫీవర్‌ సర్వే గ్రామంలో నూరు శాతం చేసి అధికారులు, ప్రజాప్రతినిధులతో మన్ననలు పొందడం అభినందనీయ మన్నారు. పర్యటనలో కలెక్టర్‌ వెంట రెడ్డిగూడెం ఇన్‌ఛార్జీ, విస్సన్నపేట తహాశీల్థార్‌ మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్‌ ఎన్‌ అప్పిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *