Breaking News

దావోస్‌ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జురిచ్ చేరుకున్నారు. దావోస్ పర్యటన కోసం ఆయన గురువారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను ప్రపంచస్థాయి వేదికగా వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, అధికారుల బృందం జురిచ్ చేరుకున్నారు. అక్కడ నుంచి దావోస్ చేరుకుంటారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెంట ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *