Breaking News

హనుమాన్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఆహ్వానం

-ఎమ్మెల్యే చేతులమీదుగా బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25న మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు జరిగే హనుమాన్ జయంతి మహోత్సవానికి రావాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న వేడుకలు 27 వ తేది వరకు కొనసాగుతాయని.. కావున ఈ మహోత్సవాలకు తప్పక విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు, డివిజన్ కో ఆర్డినేటర్ నాగాంజనేయులు, ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, ఈవో నాగినేని భవానీ, పాలకమండలి సభ్యులు గోపవరపు నాగేశ్వరరెడ్డి, కగ్గా పాండురంగారావు, యర్రంశెట్టి శ్రీను, పోలుకొండ శ్రీనివాసరావు, కోలా సూరాంబ, యక్కల మారుతి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *