
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ నేడు అనగా 21 మే 2022 తేదీన మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిపారు మరియు విజయవాడ డివిజన్లోని గూడూరు- విజయవాడ సెక్షన్ మధ్య 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మరియు ఇతర సీనియర్ అధికారులు (ప్రధాన కార్యాలయం మరియు డివిజన్ కార్యాలయానికి చెందిన అధికారులు) కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్ అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. పోర్టు అధికారులు పోర్టు కార్యకలాపాలు మరియు అక్కడి పనితీరు ముఖ్యాంశాలను జనరల్ మేనేజర్‌కు వివరించారు. పోర్టుకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను మరియు అక్కడ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి వివరాలను వారు ఆయనకు తెలియజేశారు. సరుకు లోడింగ్ మరియు ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే సహాయసహకారాలు ఉంటాయని జనరల్ మేనేజర్ పోర్టు అధికారులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన పోర్టు సైడిరగ్ వద్ద అందుబాటులో ఉన్న లోడింగ్ సౌకర్యాలను కూడా తనిఖీ చేశారు మరియు లోడింగ్ సమయంలో భద్రతా నియమాలను పాటించాలని ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు. పోర్ట్ వద్ద కోస్టల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ అక్కడ మొక్కలను నాటారు.
జనరల్ మేనేజర్ కృష్ణపట్నం స్టేషన్ – విజయవాడ సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో తనిఖీలు నిర్వహించారు. ఆయన తనీఖీలలో భాగంగా రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి సెక్షన్ పరిధిలో వంపులను, మూల మలుపులను, మరియు వంతెనలను క్షుణ్ణంగా పరిశీలించారు.
జనరల్ మేనేజర్ నెల్లూరు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు మరియు అక్కడ ప్రయాణికుల వసతులను, బుకింగ్ కార్యాలయం, సర్క్యులేటింగ్ ఏరియా మొదలగు ప్రాంతాలను పరిశీలించారు. ఆయన నెల్లూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి ప్రణాళికలను కూడా సమీక్షించారు. అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించాలని మరియు వాటిని నిర్ణయించిన సమయంలోగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అరుణ్ కుమార్ జైన్ పడుగుపాడు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు మరియు అక్కడ ప్రయాణికుల సౌకర్యాలను, సర్క్యులేటింగ్ ఏరియాను, పాదచారుల వంతెనను, స్టేషన్ మేనేజర్ కార్యాలయం మొదలగు వాటిని పరిశీలించారు. ఆయన పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ సైడిరగ్‌ను కూడా పరిశీలించారు మరియు అక్కడ లోడిరగ్, అన్లోడిరగ్ సౌకర్యాలను సమీక్షించారు. వినియోగదారులతో స్నేహపూర్వకంగా ఉండాలని మరియు స్థానిక సరుకు రవాణా వినియోగదారులకు సహకరిస్తూ సరుకు రవాణా లోడిరగ్‌ను అభివృద్ధి పర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అనంతరం జనరల్ మేనేజర్ బిట్రగుంట స్టేషన్లో తనిఖీలు చేపట్టారు మరియు అక్కడ ప్రయాణికుల వసతులు, గూడ్స్ సైడింగ్ వద్ద సౌకర్యాలను, పాదచారుల వంతెన మొదలగువవాటిని పరిశీలించారు. ఆయన క్రూ బుకింగ్ లాబీని కూడా పరిశీలించారు మరియు బిట్రగుంట లాబీ వద్ద లోకో సిబ్బందితో మాట్లాడారు. ఆయన ఒంగోలు రైల్వే స్టేషన్‌కు తనిఖీ చేశారు మరియు అక్కడ ప్రయాణికులు వసతులను, బుకింగ్ కార్యాలయాన్ని, ఎటివిఎమ్, సర్క్యులేటింగ్ ఏరియాను మరియు గూడ్స్ సైడింగ్ ను పరిశీలించారు మరియు అక్కడ యార్డ్ అభివృద్ధి ప్రణాళికలను పరీక్షించారు. ఆయన అక్కడ ప్లాట్‌ఫారంపై ఉన్న ఆహారం మరియు పండ్ల రసం స్టాల్స్‌ను తనిఖీ చేశారు మరియు అక్కడి విక్రయదారులతో మాట్లాడారు. ఆయన అక్కడి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు మరియు అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలపై వైద్యాధికారితో, పారామెడికల్ సిబ్బందితో మాట్లాడారు. ఆయన బాపట్ల రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు మరియు అక్కడ ప్రయాణికుల వసతులను, సర్యులేటింగ్ ఏరియాను సమీక్షించారు. ఆయన స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో భద్రత సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు.
జనరల్ మేనేజర్ గూడూరు – విజయవాడ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. చేపట్టిన 3వ లైను పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి వివరాలను అధికారులు జనరల్ మేనేజర్‌కు తెలియజేశారు. 3వ లైన్ పనులకు సంబంధించి ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News