Breaking News

ఒంగోలు వేదికగా ఈ నెల 28, 29 తారీకుల్లో మహానాడు… : బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం లో ఆదివారం ఈనెల 27, 28 వ తారీకు ఒంగోలు లో జరగబోయే మహానాడు కార్యక్రమం గురించి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు,Ex. MLA బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినం సందర్బంగా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయం అని, ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే ఈ మహానాడు కరోనా కారణంగా డిజిటల్ రూపంలో జరుపుకోగా ఈ ఏడు తిరిగి ఉత్సవంగా జరుపుకుంటున్నాం అని, ఒంగోలు వేదికగా ఈ నెల 28, 29 తారీకుల్లో మహానాడు పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం అని, ఈ మహానాడు చారిత్రక మహానాడు కాబోతుందని, రాబోయే ఎన్నికల్లో ఈ అరాచక వైసీపీ పాలనను గద్దె దించి తెలుగుదేశంపార్టీ ని మల్లి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రణాలికను సిద్ధం చేసి ఈ మహానాడు నుండి పనిచేయబోతున్నాం అని అన్నారు.. ఈ మహానాడుకు కూడా జరగనివ్వకుండా అధికార పార్టీ అడ్డుపడుతున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు నిర్వహించి తీరతాం అన్నారు.. సెంట్రల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మహానాడుకు తరలి వెళ్తున్నాం అని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడు లో పాల్గొని జయప్రదం చేసి తెలుగుదేశం సత్తా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, నేతలు నందేటి చంద్ర భాను సింగ్, చల్లగాలి డేవిడ్, పిరియా సోమేశ్వరరావు, దాసరి ఉదయశ్రీ, గరిమెళ్ళ చిన్న, షైక్ అన్వర్, లబ్బా దుర్గ, పత్రి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *