Breaking News

సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు)…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మట్టిలో తరిగిపోతున్న పోషక పదార్ధాలను సజీవంగా ఉంచేలా ప్రజలను చైతన్యవంతులగా చేసేందుకు సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు) నినాదంతో సైకిల్‌ యాత్రను చేపట్టిన బాణోతు వెన్నెల నేటి యువతకు స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుమారంపేట కు చెందిన బాణోతు వెన్నెల సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు) నినాదంతో సైకిల్‌ యాత్ర చేస్తు ఆదివారం విజయవాడ చేరిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయం వద్ద వెన్నెలకు సాధనంగా స్వాగతం పలికి అభినందనలు తెలుపుతు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మట్టిని రక్షించు అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు ఒక తెలుగు అమ్మయి 5 వేలు కిలో మీటర్లు సైకిల్‌ యాత్ర చేయాలనే గొప్ప నిర్ణయం అభినందనీయమన్నారు. సహజంగా మట్టిలో 3 శాతం పోషక పదార్థాల విలువలు కలిగి ఉండాలని అయితే ప్రస్తుతం 1 నుండి 2 శాతం లోపు మాత్రమే పోషక పదార్థాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్‌ తరాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. పూర్వ కాలంలో పశువులు తినగా మిగిలిన మేత మరియు పశువుల పేడను ఒక చోట చేర్చి 4 లేదా 5 నెలల పాటు నిల్వ ఉంచి అనంతరం అర్గానిక్‌ ఎరువుగా పంట పోలాల్లో వేయడం వలన పోషక పదార్థాలు సజీవంగా ఉండేవన్నారు. వీటితో పాటు చెట్లు విరివిగా ఉండడం వలన వాటి ద్వారా రాలిన ఆకులు భూములో కలిసి కొంత షోషక పదార్ధాలకు తయారు అయ్యేందుకు దోహదపడేవన్నారు. నేటి పరిస్థితులలో రైతులు సహజమైన ఎరువులపై కాకుండా కెమికల్‌తో కూడిన సేంద్రియ ఎరువులు వాడడం వృక్ష సంపద తగ్గిపోవడం వలన భూములో షోషక పదార్దాలు తరిగిపోతున్నాయన్నారు. దీనివలన భవిష్యత్‌లో ఆహార సంక్షోభం, నీటి కొరత, వాతావరణలో మార్పుల వలన జీవవైవిధ్యంలో నష్టాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. వీటిని ఆరికట్టి మట్టిని సంరక్షించుకునేందుకు ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. సద్గురు స్పూర్తితో మట్టిని రక్షించండి అనే నినాధంతో వెన్నెల చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని కలెక్టర్‌ తెలిపారు.
సైకిల్‌ యాత్ర బాణోతు వెన్నెల మాట్లాడుతూ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వయస్సు పైబడినప్పటికి రాబోయే సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను నాయకులను ఎకతాటిపైకి తీసుకువచ్చేందుకు మట్టిని రక్షించండి (సేవ్‌ సాయిల్‌) అనే నినాధంతో 100 రోజులపాటు 26 దేశాలలో 30 వేల కిల్లో మీటర్లు మోటారు సైకిల్‌ యాత్రను చేయాలనే నిర్ణయం స్పూర్తిని ఇచ్చిన్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణలోని 23 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, ఏలూరు, విజయవాడ నగరాల గుండా హైదరాబాద్‌ సైకిల్‌ యాత్రను కొనసాగిస్తున్నాట్లు తెలిపారు. తన స్పూర్తితో యువత తన మొబైల్‌ పోన్‌ ద్వారా కనీసం రోజుకు 10 నిమిషాలు మట్టిని రక్షించండి (సేవ్‌ సాయిల్‌) అంటూ వారికి తోచిన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తే కొంత మేరకు చైతన్యవంతులుగా చేయగలుగుతామని వెన్నెల తెలిపారు. కార్యక్రమంలో ఈషా పౌండేషన్‌ ప్రతినిధులు జి.రమ, వి. శ్రీనివాస్‌, కె.బాలాజి, వి.దేవేందర్‌, డి సుస్మిత, అర్జా మోహన్‌ తదిరతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *