Breaking News

ప్రతి ఒక్క కార్పోరేట్ సంస్థ సామాజిక దృక్పథం కలిగి ఉండాలి…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పోరేట్ సంస్థల వారు స్వచ్ఛందంగా దాతృత్వ స్వభావముతో సామాజిక అవసరములను గుర్తించి కార్పోరేట్ సామాజిక బాద్యత (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) గా వారి వంతు సహకారమందించుట శ్లాఘనీయమని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌. పేర్కొన్నారు. ఒ.ఎన్.జి.సి (ONGC – ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) న్యూడిల్లీ వారు రూ.39,52.568 ల విలువ కలిగిన బాండిక్యుట్ (వి.2.0) మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబో యంత్రమును నగరపాలక సంస్థకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి క్రింద అందజేయగా సదరు యంత్రమును స్థానిక వెహికల్ డిపో నందు కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ మరియు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  అమిత్ నారాయణ్ ప్రారంభించారు. ఈ యంత్రము ఏ విధమైన మ్యాన్ హోల్స్ అయిననూ శుభ్రపరచగలదు డ్రోన్ యూనిట్ నందు అమర్చిన కెమెరాల ద్వారా ప్రవాహా ఆటంకము గుర్తించుట దానిని పూర్తిగా తొలగించుట దీని ప్రత్యేకత అంతేకాక మ్యాన్ హోల్ లోపల విషవాయు పరిమాణము అంచనా వేయు సదుపాయము ద్వారా క్లీనింగ్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించుటకు ఉపకరించును. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడతూ నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ సమర్ధ నిర్వహణకు ఉపకరించు మ్యాన్ హోల్ క్లినింగ్ రోబో యంత్రమును అందించిన ఒ.ఎన్.జి.సి వారికి కృతజ్ఞతలు తెలియచేసినారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అమిత్ నారాయణ్ మాట్లాడతూ పర్యావరణ పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు స్వచ్చమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించుటకు నగరపాలక సంస్థ చేపట్టిన పలు కార్యక్రమములకు తమ వంతు సహకారము అందించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజరెడ్డి, కార్పొరేటర్  పలసాని మణెమ్మ, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎస్ఇ ప్రాజెక్ట్స్ భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. కోటేశ్వరరావు, ఒ.ఎన్.జి.సి మనవ వనరుల విభాగ అధిపతులు నవేద్ రావు, రాజేష్ కలేకూరి, కౌశిక్ వేదుల, ఉదిత్ నుటియాల్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *