Breaking News

స్పందన లో వచ్చు సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి

-మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులపై దృష్టి సారించాలి.
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి స్పందన నిర్వహించారు. ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించి నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు ఎదురౌతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని అధికారులకు సూచిస్తూ, సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 23 అర్జీలు సమర్పించగా వాటిలో అదనపు కమిషనర్ (జనరల్) – 4, ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 10, పబ్లిక్ హెల్త్ విభాగం –3, రెవెన్యూ – 3, యు.సి.డి (పి.ఓ) – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 6 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో రెవెన్యూ – 2 అర్జీలు, సర్కిల్ – 2 కార్యాలయంలో రెవెన్యూ – 2 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 2 అర్జీలు ప్రజలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *