Breaking News

ప్రాణదాతలైన రక్తదాతలకు వందనం…

-రక్తం కొరతతో ఏ ఒక్కరూ ప్రాణాలు కొల్పోకూడదు
-కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవుని ప్రతి రక్తపు బొట్టు ఎంతో అమూల్యమైనది, వెలకట్టలేనిదని రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడుతున్న ప్రతీ రక్తదాతకు వందనం అని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ జిల్లా అధ్యక్షులు, కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సత్యనారాయణపురంలోని దక్షణ మధ్య రైల్వే ఎలక్ట్రిక్‌ ట్రాక్ష్‌న్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అడిటోరియంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో రక్తదానం చేసేందుకు సంఫీుభావం చాటుదామని చేయి చేయి కలిపి ప్రాణాలు కాపాడుదామని సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేస్తానని కుటుంబ సభ్యులను, స్నేహితులను, సహోద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తానని, ఏ ఒక్కరూ రక్తం కొరతతో మరణించకుండా నావంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ రోజు రక్తం అవసరమైన ఎంతో మంది రోగులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడ క్షతగ్రాతులకు అవసరమైన రక్తాన్ని తక్షణమే అందించలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. రక్తదాతల సహకారంతో క్షతగ్రాతులకు, తలసెమియ వ్యాధిగ్రస్థులకు, రక్తహీనత కలిగిన గర్భిణీ స్త్రీలకు వైద్యులు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఒక సారి రక్తదానం చేసిన దాత మరొకరి ప్రాణాన్ని కాపాడినట్లేనన్నారు. రక్తదానం చేస్తే నీరసించి పోతామనే అపోహను తొలగించి రక్తదానం చేసిన ప్రతీ సారి మరింత ఆరోగ్యవంతమైన రక్తాన్ని పొందగలుగుతారనే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి రక్తదానం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలన్నారు. ఎక్కువగా రక్తదానం చేసిన యువతే మరల రక్తదానం చేస్తున్నారని అలా కాకుండా కొత్తవారు కూడా ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్పూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదాన శిబిరాలు సేవాకార్యక్రమాల నిర్వహణలో జిల్లా రెడ్‌ క్రాస్‌ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రైల్వే అధికారులు, ఉద్యోగులను అభినందిస్తున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
అనంతరం రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో 54 సార్లు రక్తదానం చేసిన యం రమేష్‌, బి అనిల్‌ కుమార్‌, కెవిఎస్‌ సుధీర్‌బాబు, 15 సార్లు రక్తదానం చేసిన జిటి సత్యప్రసాద్‌లను జిల్లా కలెక్టర్‌ సన్మానించారు.
కార్యక్రమంలో దక్షణ మధ్య రైల్వే డిఆర్‌యం షివేంద్ర మోహన్‌, సీనియర్‌ డిఇఇ ఎస్‌ మునిరెడ్డి, ఇటిటిసి ప్రిన్సిపాల్‌ బి.వెంకటేష్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా చైర్మన్‌ డా.జి. సమరం, కార్యదర్శి ఇళ్లా రవి, రెడ్‌ క్రాస్‌ వైద్యురాలు డా. శిరీష, కో`ఆర్డినేటర్‌ జి. స్వప్న, మేనేజర్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌, సునీత, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *