విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక ధరలకు తిను బండరాలు, శీతల పానీయాలు, బిస్కెట్, చిప్స్ ప్యాకెట్స్ ఇతరములు అమ్మకాలు జరిపిన సంబంధిత షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు ఎటువంటి వస్తువులను అమ్మినా, పరిమితికి మించి నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి. కనక రాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో కృష్ణలంక, చిట్టినగర్, PNBS bus station, నిడమానూరు, తాడిగడప, ఆటో నగర్ బస్ టెర్మినల్ మరియు పటమట ఏరియా లోని పలు దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు వస్తువులను విక్ర యించిన దుకాణ నిర్వాహకుల వారిపై కేసులు నమోదు చేయటం జరుగినది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు తెలియజేశారు.
Prajavartha Online Telugu News