Breaking News

నగరంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం సర్కిల్-2 పరిధిలోని మారుతీ నగర్, మధురానగర్, సాంబమూర్తి రోడ్, అలంకార్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. 29వ సచివాలయం పరిధిలోని మారుతీ నగర్ నందు పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఇంటింటి చెత్త సేకరణ సక్రమముగా జరగకపోవుట గమనించి పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచి పూర్తి స్థాయిలో నూరు శాతం నివాసాల నుండి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో సైడ్ డ్రెయిన్స్ నందు వర్షపు నీటి పారుదల విధానము పరిశీలించి వర్షపు నీటి ప్రవాహమునకు డ్రెయిన్ నందు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములు తొలగించి మురుగునీరు మరియు వర్షపు నీటి ప్రవాహం సక్రమము పారేవిధంగా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫుట్ పాత్ క్రింద డ్రెయిన్లు ఎప్పడు శుభ్రం చేసినది తదుపరి మరలా ఎప్పుడు శుభ్ర పరచవలసియున్నది మొదలగు అంశాలతో కూడిన నివేదిక సాయంత్రానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మదురానగర్ సాయిబాబా కాలనీ రైల్వే ట్రాక్ లైన్ లో కొంత వరకు మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండుట గమనించి మిగిలిన ప్రాంతములో ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి సాంబమూర్తి రోడ్ లో పర్యటిస్తూ రోడ్ ఎండ్ టు ఎండ్ ఇంటర్ లాకింగ్ టైల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, 36వ డివిజన్ పరిధిలోని చర్చి ఎదురుగా కెనాల్ బండ్ లో గోడలేని చోట్ల గోడ నిర్మాణం చేపట్టి ఫెన్సింగ్ వేయాలని మరియు శ్రీలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఎదురుగా గల సెంట్రల్ డివైడర్ నందలి సెంట్రల్ లైటింగ్ పోల్ కు కెనాల్ బండ్ వీక్షించే విధంగా సి.సి.కెమెరా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా లెనిన్ సెంటర్ నుండి అలంకార్ వైపు గల వంతెన పై ఫెన్సింగ్ ఏర్పాటు చేయునట్లుగా చూడాలని సూచించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *