Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల ప్రకారము చీఫ్ మెడికల్ ఆఫీసర్ వారి ఛాంబర్ నందు సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చేపల మార్కెట్ అసోసియేషన్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంలో జూలై 1 వ తారిఖు నుండి నగరములో పూర్తి స్తాయీలో సింగల్ యుజిడ్ ప్లాస్టిక్ నిషేధించే ప్రక్రియలో భాగంగా నగరపాలక సంస్థ ద్వారా తగు చర్యలు తీసుకోవటంతో పాటుగా ప్రజలకు మరియు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ బ్యాగ్ కు బదులుగా ప్రతి ఒక్కరు ప్రత్యామయంగా జ్యుట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, పేపర్ బ్యాగులు ఉపయోగించే విధముగా మీ ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వల మార్గదర్శకాలను పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోనబడునని Dr.బాబు శ్రీనివాసన్ CMOH i/c హెచ్చరించారు. నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడుకొనుటకు సహకరించవలసినదిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *