విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వన్ టౌన్ లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈనెల 15, 16, 17 తేదీలలో టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న దినత్రయ చతుర్వేద మాస పారాయణానికి విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పక విచ్చేసి స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కలిసిన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మంగిపూడి వెంకటశాస్త్రి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News