Breaking News

సచివాలయ సిబ్బంది సమిష్టిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలి…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, గురువారం శాంతినగర్ నందలి 257, 258 సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మరియు సేవలను అందించేలా సమిష్టి కృషి చేయాలని ఆదేశించారు. జగనన్న గృహ నిర్మాణములకు సంబందించి సెక్రెటరీలను వారి టార్గెట్ ఎంత, ఎంత మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు, లేని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేయుటకు చేపట్టిన చర్యలు, లబ్దిదారుని వాటా చెల్లించిన వారి వివరములు లే అవుట్లో ఇంటి నిర్మాణం ప్రారంభమైనది లేనిది మొదలగు అంశాలపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ప్రతి లబ్దిదారుడు సంతృప్తి చెందు విధంగా వారికి గల సందేహాలను నివృత్తి చేయవలసిన ఆవశ్యకత మీ పై ఉందని, ప్రభుత్వం ద్వారా వారికీ కల్పిస్తున్న ప్రయోజనాలను సమగ్రంగా వివరించాలని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాలు సాధించి ప్రతి లబ్దిదారుడు గృహ నిర్మాణము చేపట్టుకొనే విధంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవలెనని తెలియజేశారు. అదే విధంగా సిబ్బంది యొక్క వివరాలు, మూవ్మెంట్ రిజిస్టర్ మరియు ఇతర రిజిస్టర్ లను సక్రమముగా నిర్వహిస్తునది లేనిది పరిశీలించి, ప్రజల నుండి వచ్చిన అర్జిలను విధిగా రిజిస్టర్ నందు నమోదు చేసి వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చూడలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకముల వివరాలు మరియు అర్హుల జాబితాలను విధిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిస్ ప్లే బోర్డు నందు ప్రదర్శించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *