-అధికారులకు పలు సూచనలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 29వ డివిజన్ పరిధిలోని మధురానగర్ కమ్యూనిటీ హాల్ (కర్మల భవనం)ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, సత్వరమే ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంలో కమ్యూనిటీ హాల్ ప్రక్కన కాలువ గట్టు నందలి ఖాళి స్థలమును చదును చేసి పచ్చదనం పెంపొందించి ప్రజలకు అందుబాటులో ఉండేలా సిట్టింగ్ ప్లాజా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా రామాలయం వీధిలో చేపట్టిన యు.జీ.డి పైపు లైన్ పనులను పరిశీలించి పైపుల యొక్క నాణ్యత మరియు మ్యాన్ హోల్ యొక్క లోతు మొదలగు అంశాలను క్షుణంగా పర్యవేక్షించారు. తదుపరి శాంతి నగర్ సచివాలయం భవనం మొదటి అంతస్తు నందు నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల యొక్క నాణ్యతను రీబౌండ్ హ్యామర్ మరియు ఇతర నాణ్యత ప్రమాణాలు కొలుచు పరికరములతో స్వయంగా పరిశీలించి నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోపుగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News