Breaking News

కబేళ నందు మాత్రమే పశువులను వధించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీద్ పండుగను పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో నగరపాలక సంస్థ కబేళా నందు బీఫ్ వ్యాపారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమములో డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ కె.బాబూరావు, భవానిపురం సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఉమ్మార్, నగరపాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా. ఏ.రవిచంద్ పాల్గొన్నారు. బక్రీద్ పండుగ సందర్బంలో నగర విధులలో ఎక్కడ పశువులను వధించి అమ్మకాలు సాగించరాదని. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధము మరియు పశు సంరక్షణ చట్టము -1977 ప్రకారం గోవధను నిషేదించిన దర్మిలా ప్రభుత్వం వారి మార్గదర్శలకు అనుగుణంగా మరియు కోవిడ్ నిబందనలకు అనుగుణంగా మాత్రమే వ్యాపారాలు సాగించుకొనే విధంగా అధికారులతో సహకరించాలని సూచించారు. పండుగ వేళ పశువధ నిర్వహించుకొనుటకు నగరపాలక సంస్థ కబేళా నందు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయుటతో పాటుగా అందుకు అవసరమైన అన్ని వసతులు మరియు సౌకర్యాలు కల్పించుట జరిగిందని వివరించారు. గోవులను చంపటం నిషేదిస్తూ, ఆరుబైట వీధులలో ఎవరు పశువధ నిర్వహించరాదని, కేవలం అన్ని జంతువధ కబేళా నందు మాత్రమే నిర్వహించుకొనే విధంగా వ్యాపారాలు చర్యలు తీసుకోని అధికారులతో సహకరించాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2 సంవత్సరాల లోపు, అనారోగ్య, వ్యాధి సోకిన, యాక్సిడెంట్ అయిన పశువులను వధించరాదని తెలియజేసారు. అదే విధంగా కబేళాకు వచ్చు వారు విధిగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి అధిక మంది కాకుండా కేవలం ఒక జీవానికి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే అనుమతి ఇవ్వటం జరుగునని పేర్కొన్నారు. నగరంలో పోలీస్, పశుసంవర్ధక శాఖ, ట్రాన్స్ పోర్ట్, రెవిన్యూ, పంచాయితీ, మున్సిపల్ కార్పోరేషన్ మొదలగు శాఖా అధికారుల నిరంతర పర్యవేక్షణ నగరంలో అనధికారికంగా లేదా వీధులలో పశువధ జరగకుండ పరిశీలించుట జరుగునని తెలియజేసారు. ఇందుకు సంబందించి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. నగరంలో బీఫ్ వ్యాపారాలు విధిగా పై సూచనలు పాటిస్తూ, అధికారులతో సహకరించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తమ యొక్క వ్యాపారాలు సాగించుకొనవలసినదిగా తెలియజేసారు. ఈ అవగాహన కార్యక్రమములో పలువురు అధికారులతో పాటుగా నగరంలోని బీఫ్ వ్యాపారాలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *