-సిసిఎల్ ఏ అధికారులతో జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్ సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు ఏ, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమీషనర్ సిద్ధార్థ జైన్‌లు ప్రధాన కార్యాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్ జిల్లా నుండి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ సిసిఎల్‌కు జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలో 8 మండలాలకు చెందిన 136 గ్రామాలలో గ్రౌండ్ ఫైయింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో విస్సన్నపేట మండలంలో 10 గ్రామాలు, గంపలగూడెం మండలంలో 21 గ్రామాలు, తిరువూరు మండలంలో16 గ్రామాలు, ఏ కొండూరు మండలంలో 13 గ్రామాలు, రెడ్డిగూడెం మండలంలో11 గ్రామాలు, జగ్గయ్యపేట మండలంలో 23 గ్రామాలు, కంచిచర్ల మండలంలో 16 గ్రామాలు, వత్సవాయి మండలంలో 26 గ్రామాలతో కలిపి మొత్తం 136 ఉన్నాయన్నారు. వీటిలో 26 గ్రామలలో డ్రోన్ ప్లె˜ౖ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. 13 గ్రామాలలో డేటా నాణ్యత పరిశీలన (క్యూసీ) పూర్తి అయిందన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట, కంచికచర్ల మండలం పరిటాల, గంపలగూడెం మండలం రాజవరం గ్రామాలలో13వ నోటిఫీకేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. తిరువూరు మండలం చింతలపాడు, గంపలగూడెం మండలం కనుమూరు గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిందన్నారు. తిరువూరు మండలం ఆంజనేయపురం, వత్సవాయి మండలం చిట్యాల, తిరువూరు మండలం ముస్తిగుంట్ల గ్రామాలలో ఎల్‌పియం జనరేషన్ దశలో ఉన్నాయన్నారు. ఎ కొండూరు మండలంలోని వామకుంట్ల, మారేపల్లి గ్రామాలలో గ్రౌండ్ వాలిడేషన్ పనులు పురోగతిలో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికాడ్స్ ఆఫీసర్ కె. సూర్యరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News