Breaking News

ఘనంగా ” సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్” 16వ వార్షికోత్సవ వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించి.. విజయ పథంలో శరవేగంతో పయనిస్తున్న ప్రఖ్యాత సంస్థ “సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్” 16వ వార్షికోత్సవ వేడుకలు జూలై 11 వ తేదీన విజయవాడ నగరంలోని ‘మురళి రిసార్ట్స్’ లో వైభవోపేతంగా జరిగాయి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో ఓ సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా తమ సంస్థను ప్రారంభించామని, కస్టమర్ల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో చక్కని అభివృద్ధిని సాధించామని ఆయన అన్నారు. 2017 వ సంవత్సరంలో ఓ వినూత్నమైన ఆలోచనతో ఎర్రచందనం ప్లాంటేషన్ రంగంలోకి ప్రవేశించామనీ, కస్టమర్ల ఆదరాభిమానాలే సోపానాలుగా ఈ నూతన రంగంలో కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని ఆయన అన్నారు. కేవలం 5 ఏళ్లలో 1500 ఎకరాలలో 15 వెంచర్లు విజయవంతంగా పూర్తి చేయడం…6 లక్షలకు పైగా నాటబడిన ఎర్ర చందనం మొక్కలు… 4 వేల మందికి పైగా ఉన్న సంతోషకరమైన కస్టమర్లే తమ సంస్థ అభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎర్ర చందనంతో చేసే బొమ్మలకు, ఎర్ర చందనం పౌడరుకు, ఆయిలు, ఎర్రచందనం ఒక భాగంగా ఉండే ప్రతి ఉత్పత్తికీ.. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఆసియా దేశాలలో అమితమైన డిమాండ్ ఉందనీ, ఈ డిమాండ్ కస్టమర్లకు కాసుల వర్షం కురిపిస్తుందనీ. ప్రజలంతా ఈ వాస్తవాలను గ్రహించాలనీ శ్రీనివాస్ అన్నారు.

ప్రతి ఒక్కరూ ఎర్ర చందనం మొక్కలతో కూడిన సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి ఓ ప్లాట్ ని వెంటనే కొనుగోలు చేసి.. తమ బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. చట్టబద్ధమైన రీతిలో ఎర్రచందనం సాగు, విక్రయాన్ని చేపట్టి… ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన అరుదైన ఘనత తను సొంతమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. సంస్థ అభివృద్ధికి నిరంతరంగా శ్రమించి, సంస్థ విజయపథానికి బాటలు వేసిన సంస్థ ఉద్యోగులకు మరియు మార్కెటింగ్ సిబ్బందికి  శ్రీనివాస్ అవార్డులను, సర్టిఫికేట్లను అందచేశారు.

ఈ వేడుకలలో డాన్సర్లు ఆకట్టుకునే నృత్య ప్రదర్శన చేసారు. గాయకుడు కృష్ణ చైతన్య తన గీతాలాపనతో ఆహూతులను అలరించారు. కార్యక్రమం ఆద్యంతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా.. అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *