Breaking News

నిర్మాణాలలో స్థానికంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించాలి… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్మాణాలలో స్థానికంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ప్రణాళికాబద్దంగా త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు  పంచాయితీరాజ్ అధికారులు కృషి చేయాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశించారు. సోమవారం  స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మాణంలో వున్న ప్రభుత్వ భవనాల పురోగతిపై పంచాయితీరాజ్ అధికారులతో  మండల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా  జె సి  మాట్లాడుతూ  తొలుత ఏయే భవనాలు ఏ మేరకు నిర్మాణ దశలలో వున్నాయో పలువురు డి ఈ , ఏ ఇ లను నేరుగా అడిగి తెలుసుకొన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు , డాక్టర్ వై.ఎస్.ఆర్ హెల్త్ క్లీనిక్స్,  బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ (బిఎంసిసిలు), అంగన్‌వాడీ భవనాలలో ఇంకా నిర్మాణాలు మొదలుకాని వాటిని ప్రారంభించడం, శ్లాబ్ లెవల్‌లో వున్నవాటికి క్లాట్లు వేయడం, నిర్మాణాలు పూర్తికావచ్చినవాటిని పూర్తిచేసి అప్పగించడం వంటి పనులు ప్రతి వారం లక్ష్యంగా చేపట్టాలన్నారు. చేపట్టిన అన్ని భవనాలు ఈ జూలై మాసాంతం నాటికి 50 శాతం పైగా పూర్తిచేయడానికి లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు మరో రెండు వారాల్లో , రైతు భరోసా కేంద్రాలు, వైస్సార్ హెల్త్ క్లి క్లినిక్ లు 50 శాతం పనులు ఎట్టి పరిస్థితులలోను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని కోరారు.

అలాగే, నిర్మాణాలలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు, ఏజన్సీలకు బిల్లులు చెల్లింపులు జరగలేదని కొన్నిచోట్ల నిర్మాణాలు నిలిపివేశారని, వారి బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో చెల్లింపులు జరగలేదని జె.సి తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీలను చైతన్యపరచి, ఇంతవరకు ఖర్చు చేసిన నిధులకు చెందిన బిల్లులను తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని జె.సి తేల్చిచెప్పారు. అలాగే,  ఏ రోజు జరిగిన పనులు ఆరోజే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. అధికారులు ప్రతి రోజు దిన చర్యగా ఆన్‌లైన్‌లో స్థానాన్ని పరిశీలించుకొని, మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకొని చేపట్టాల్సిన పనులు గురించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ ఎస్ఈ ఎం. ఈరాస్వామీ , డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *