Breaking News

బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ వారి విశిష్ట సస్యరక్షణ ఉత్పాదనలు మార్కెట్లోకి విడుదల…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ బహుళజాతి సంస్థ స్థానిక నోవాటెల్‌ హోటల్‌ నందు నూతన సస్యరక్షణ ఉత్పాదనలు 1.రోన్ఫెన్‌, 2.ఆక్స్‌మ్యాన్‌, 3.వార్డెన్‌, 4.టోంబో, 5.రివీల్‌లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విమల్‌ అలవాధి, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజన్‌ కుమార్‌ ఐలవాధి, నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ యస్‌.నరసయ్య, హెచ్‌-సేల్స్‌ & మార్కెటింగ్‌ (సౌత్‌ జోన్‌) పి.అశోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌, భారతదేశపు కెమికల్‌ రంగంలో 15 అగ్రోకెమికల్‌ కంపెనీలలో ఒకటి. ఇది పరిశోధన-ఆధారిత సంస్థ, ప్రపంచ నలుమూలలో ఉన్న రైతులకు అత్యున్నత నాణ్యత మరియు తక్కువ ఖర్చుతో కూడిన వన్‌-షాట్‌ వ్యవసాయ పరిష్కారాలను సరిక్రొత్త ఉత్పత్తుల రూపంలో అందిస్తోంది. భారత ప్రభుత్వ లక్ష్యం అయిన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, బెస్ట్‌ అగ్రోలైఫ్‌ ఆధునిక ఉత్పాదనలను అందిస్తూ తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావంతమైన ఉత్పాదనలు అందించి రైతులకు అధిక దిగుబదులు ఇచ్చేందుకు తోడ్పడుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్‌ఎబిఎల్‌ గుర్తింపు పొందిన ల్యాచ్లు, పరిశోధన మరియు అభివృద్ధి కలిగి అత్యంత ఆధునిక పరికరాలతో అత్యుత్తమ నాణ్యతగల ప్రపంచ స్థాయి అధునాత ఉత్పత్తులను అందిస్తూ నిరంతరం ప్రపంచంలోని రైతులు ఎదుర్కొంటున్న అతికష్టమైన వ్యవసాయ సమస్యలకు తగిన పరిష్కారాలను కృషి చేస్తోంది. ఈ సంస్థ సాలీనా 30,000 టన్నుల ఫార్ములేషన్‌ సామర్ధ్యం మరియు సాలీనా 7000 మెట్రిక్‌ టన్నుల టెక్నికల్‌ గ్రేడ్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగివుంది.
ఈ సంస్థ 70కు మించి ఫార్ములేషన్స్‌తో కూడిన పురుగుమందులను, కలుపుమందులను, తెగుళ్ళమందులను మరియు మొక్క పెరుగుదల మందులను అందిస్తూ అలాగే 360 ఫార్ములేషన్స్‌ మరియు 30 కంటే ఎక్కువ సాంకేతిక తయారీ లైసెన్సులను కలిగి ఉంది. బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌లో 1000 మందికి పైగా ఆనందకరమైన ఉద్యోగులు మరియు 35,000కి పైగా పంపిణీదారులు దేశవ్యాప్తంగా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *