Breaking News

ముస్లీంలకు సంక్షేమ పధకాలు అందించటంలో ప్రభుత్వం విఫలమైంది… : షేక్ జలీల్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దామాషా ప్రకారం ముస్లింలకు హక్కులను, సంక్షేమ పధకాలు అందించటంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం జరిగే బంద్ కు ముస్లింలతో పాటు అన్ని రాజకీయ, ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలియజేయాలని నగరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ కోరారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ముస్లిం హక్కులను కాలరాస్తు మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు.  పేద మహిళ ముస్లింలకు దుల్హన్ పధకం క్రింద వచ్చు నిధులు గత ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పధకం రద్దు చేశారన్నారు. అన్యాక్రాంతమైన వక్త్ర బోర్డు భూములు స్వాధీనం చేసుకుంటామని అలాగే ముస్లీలకు రిజర్వేషన్ల శాతం పెంచుతామని మోసం చేశారన్నారు. విదేశీ విద్య వలన ఎంతో మంది గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్య చదువుకుంటున్నారని ఈ ప్రభుత్వం దానికి తూట్లు పొడి చిందన్నారు. రాష్ట్రంలో వక్స్ బోర్డు  భూముల పై వచ్చిన ఆధాయాన్ని నిరుపేద ముస్లీంలకు అందించాలని కోరారు. రాష్ట్రంలో ముస్లింలు ఉపాధి లేక ఆకలి కేకలతో చనిపోతున్నారని వీళ్ళ జీవనోపాధి కోసం కనీస చర్యలు చేపట్టాలన్నారు. నిరుపేద ముస్లింలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 15న రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వటం జరిగిందన్నారు. మైనార్టీ నాయకులు ఓవైసీ వస్తారని బెంజిసర్కిల్ నుండి వారాదివరకు సాగి  అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తామని తెలిపారు. దీనిలో ముస్లీం సామాజికవర్గం అంతా ఏకమై తమ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *