విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగును సంస్కృతంలోకి తర్జుమా చేసే టెక్నాలజీని కనుగొని భారత ప్రభుత్వంచే పేటెంట్ పొందిన ప్రొఫెసర్ డా.తియ్యబిండి కామేశ్వరరావు ఆచార్యులను విశ్వబ్రాహ్మణ విఙ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్థానిక శ్రీరఘురామ కళ్యాణవేదికనందు ఆదివారం ఘన సన్మానం చేశారు. తొలుత వైశ్వకర్మణ వేదపండితులు వేదమంత్రోశ్చరణతో మంగళవాయిద్యములతో పూర్ణకుంభంతోస్వాగతం పలికి సభాస్థలికి తోడ్కొనివచ్చారు. ఉభయ రాష్ట్రాలలోని వేదపండితులు పురోహితులు అభిమానులు రజిత కిరీటధారణ, స్వర్ణ అంగుళీయకము, దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈకార్యక్రమానికి కందుకూరి శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించగా సన్మానకమిటి అధ్యక్షులు భవిరి రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖవైద్యులు డా.వజ్రాలశివకుమార్ విశిష్టఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేయగా వేద విదుషిణీమణి సవితా ఆచార్య విష్ణుసూక్తం ఘనాపాఠాన్ని ప్రార్ధనాగీతాన్ని రమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పంచబ్రహ్మలైన కందుకూరి శ్రీనివాసాచార్యులు
తుమ్మోజురామలక్ష్మణాచార్యులు మాచర్ల సవితా ఆచార్య కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య తదితర ప్రముఖులను ఉచిత రీతిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విఙ్ఞానవేదిక వార్ట్సప్ క్రియేటర్ సత్తెనపల్లి ఉమామహేశ్వరాచార్యులు, గౌరవాధ్యక్షులు చిప్పాడ హేమసుందర్ ఆచార్యులు, ప్రధానకార్యదర్శి కందుకూరి రమేష్ ఆచార్య, క్రియాశీలక సభ్యులు అప్పల భక్తుల శివకేశవరావు, భవిరిశంకరనాధ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News