Breaking News

కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత !!

-పథకాల్లో పారదర్శకతకు పెద్దపీట
-సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లు
-డీఆర్సీ సమావేశంలో మంత్రుల వెల్లడి
-అజెండాలోని అంశాలపై సమగ్ర చర్చ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని , సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కె రోజా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) , పెనమలూరు శాసన సభ్యులు కొలుసు పార్ధసారధి, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్, పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ , జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తదితరులు హాజరయ్యారు. కలెక్టర్‌ పి.రంజిత్ బాషా, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కె రోజా అన్నారు. ఈ సందర్భంగా అఆమే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల లు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి ఆర్ కె రోజా అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు అధునాతన సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు. మందుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, అధికారం అంటే అందలం ఎక్కి ఆర్బాటం చేయడం కాదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను కష్టాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచిస్తున్నారని, అందుకే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతగా పాల్గోవాలని ఆదేశించారు. నెలరోజుల్లో పోర్టుపై శుభవార్త వింటామని న్యాయపరంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలిగాయిని సీఎం దగ్గర సమావేశం కూడా జరిగిందన్నారు.మరో నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయిని మంత్రి జోగి రమేష్ తెలిపారు. తాను గోదావరి వరద ప్రాంతాలను మంగళవారం కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి వెంట
హెలికాఫ్టర్ లో వెళ్లానని అసిస్టెంట్ పైలెట్ సీఎం దగ్గరకు వచ్చి వాతావరణం |అనుకూలంగా లేదని, రాజమండ్రిలో ల్యాండ్ అవుదామని చెప్పారు. ముఖ్యమంత్రి మాత్రం తాను ప్రజల ఇబ్బందులను చూడాలనుకున్నాని. అనుకున్న ప్రాంతాల్లోనే ల్యాండ్ చేయమని పైలెట్లకు ఆదేశించారు. వాతావరణం సరిగా లేకపోతే పదినిముషాలు గాలిలోనే తిరగాలని సూచించారని అన్నారు అప్పుడు జగనన్న ధైర్యం చూస ఆశ్చర్యం చెందానన్నారు. పేదల పట్ల కనికరం, సహాయం చేయడంలో ఆయన విశాలహృదం, ఆత్మవిశ్వాసం పట్ల ముగ్ధుడైయ్యానని చెప్పారు. మంచి మనసున్న ముఖ్యమంత్రితో కలిసి మంత్రిగా, ఎంఎల్ఎగా సేవలు అందిస్తున్నందుకు తాను నిజంగా ధన్యుడయ్యానని అన్నారు.
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1, 82,861 హెక్టార్లలో 2021 ఖరీఫ్ కాలంలో 53, 916 హెక్టార్లలో ( 29 శాతం ) సాగు చేస్తే, 2022 సంవత్సరంలో 58, 233 హెక్టార్లలో ( 32 శాతం ) రైతులు వరి, చెరుకు, మినుములు, వేరుశెనగ తదితర పంటలను పండించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనోహరరావు వివరించారు. 2020వ సంవత్సరములో ఏప్రిల్ మాసములో వడగండ్ల వాన వలన కృత్తివెన్ను, బంటుమిల్లి మండలములలో వరి పంట నష్టపోయినదని, అదే విధముగా నవంబర్ 2020 మాసము నందు సంభవించిన నివర్ తుఫాన్ వలన జరిగిన పంట నష్టమునకు కూడా నష్ట పరిహారం బట్వాడా కాలేదని పెడన శాసన సభ్యులు జోగి రమేష్ తెలుపగా, ఏప్రిల్ మాసములో కురిసిన వడగండ్ల వాన వలన జరిగిన పంట నష్టమునకు రూ.4.54కోట్లు, నవంబర్ నెలలో నివర్ తుఫాను వలన జరిగిన పంట నష్టమునకు రూ. 3.26 కోట్లు ప్రభుత్వము నుండి నిధులు విడుదల కావలస విషయమై తొలుత చర్చించారు. 2021-22 సంవత్సరమునకు 80000 సిసిఆర్సి కార్డులు కౌలు రైతులకు జారీ చేయుట లక్ష్యం కాగా, 83376 సిసిఆర్సి కార్డులు ఇవ్వడం జరిగినదని రెవెన్యూ, బ్యాంకింగ్ సమన్వయంతో అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి భూ యజమానులకు, కౌలు రైతులకు అవగాహన కలిగించి జిల్లాలోని 390 రైతు భరోసా కేంద్రాలకు 302 మంది బ్యాంక్ కరెస్పాండెంట్ లను మ్యాపింగ్ చేయించి వారి ద్వారా రైతులకు కావలసిన బ్యాంకింగ్ సేవలు రైతు భరోసా కేంద్రాలనుండి అందించడం జరిగిందని వివరించారు. బ్యాంక్ లనుండి సేకరించిన సమాచారము ప్రకారం 2021-22 సంవత్సరం లో రూ.365 కోట్లు రుణ సాయం కౌలు రైతులకు అందించబడినట్లు జిల్లా వ్యసాయాధికారి వివరించారు. తర్వాత, ఉద్యానవనశాఖ, రాష్ట్ర కృషి వికాస్ యోజన, ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స ఫర్మేషన్ ప్రాజెక్ట్ గురించి అధికారులు వివరించారు. పశు సంవర్ధక శాఖ, పశు గ్రాస విత్తనాలు సరఫరా, డాక్టర్ వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం కు సంబంధించి అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే మత్స్య శాఖ సంబంధించిన వివరాలు తెలియచేసారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలో రూ.180.92 కోట్లతో 84, 614 గృహాల నిర్మాణంలో 71 శాతం గ్రౌండింగ్‌ చేసినట్లు జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ కె. రామచంద్రన్ వివరించారు. జిల్లాలో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని టిడ్కో అధికారి చిన్నోడు తెలిపారు.
జిల్లాలో నాడు నేడు పథకం రెండో విడతలో జిల్లాలోని 25 మండలాల్లో 481 పాఠశాలల్లో రూ.235. 50 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వివరించారు. రెండో విడతలో అదనపు తరగతులను నిర్మించనున్నట్లు చెప్పారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ, బీ సి వెల్ఫేర్, మైనార్టీ సుసంక్షేమ శాఖల అధికారులు తమ శాఖల అధికారులు తమ శాఖల పురోగతిని గూర్చి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *