విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 29, 30, 31 తేదీలలో లబ్బీపేటలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ సెంటర్ లో జరుగు ఫోటోగ్రాఫర్స్ కార్నివాల్ కు ముఖ్య అతిథిగా విచ్చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ కార్నివాల్ పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగింది. ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి ప్రారంభోత్సవ సమయానికి విచ్చేస్తామని సానుకూలంగా తెలియచేశారని తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసిన వారిలో విజయవాడ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు అమర్ నాథ్, సెక్రటరీ చొక్కర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కనకరావు, ట్రెజరర్ ఎం.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News