Breaking News

ఆగష్టు నెలలో కాపు కళ్యాణ మండప నిర్మాణ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో సకల హంగులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఇందుకోసం కాపు కార్పొరేషన్ ద్వారా విడుదలైన రూ. కోటి నిధులు వీఎంసీ ఖాతాలో జమ అయినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణ మండప నిర్మాణానికై ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా.. ఆగష్టు 10 న టెండర్లు తెరవబడతాయని తెలియజేశారు. గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాన్ని.. ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని చేసిచూపుతున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. సామాన్యులకు వివాహాది శుభకార్యాలు భారమైన ప్రస్తుత తరుణంలో.. కాపు క‌ళ్యాణ మండ‌పం నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేస్తూ డిసెంబర్ 29, 2021 న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.165 విడుదల చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఎల్బీఎస్ నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న దాదాపు 3,822 చదరపు అడుగుల ఖాళీ స్థలాల్ని పరిశీలించడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా పేద ప్రజలు అట్టహాసంగా తమ పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్‌ను నిర్మించడం జరుగుతుందన్నారు. ఆ దిశగా వీఎంసీ అధికారులు డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. టెండర్లు తెరచిన వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేస్తామని తెలియజేశారు. కాపు సామాజికవర్గ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *