-జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ రెహమాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ , వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బందిలో ప్రొబేషన్ ఖరారు అయిన వారందరికీ కొత్త పి ఆర్ సి స్కేల్స్ ప్రకారం జూలై నెల జీతాలు ఆగస్ట్ మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాలో జమ అవుతాయని ఎన్టీఆర్ జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారి ఎంహెచ్ రెహమాన్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్&అకౌంట్స్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా వున్న సచివాలయ ఉద్యోగులకు ఆగస్టు ఒకటో తేదీన జూలై నెలకు సంబంధించి పెరిగిన కొత్త జీతాలు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ రెహమాన్ తెలిపారు.
Prajavartha Online Telugu News