విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గాంధీ హిల్ నందలి ప్లానిటోరియం ను సందర్శించి దానిలో ఫోటో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లానిటోరియం నందు ఫోటోలు ఏర్పాటు చేయుటకు అవసరమైన ఫోటో ఫ్రేమ్ మరియు ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయుటతో పాటుగా గాంధీ హిల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులకు సూచించారు. ప్లానిటోరియం నకు అవసరమైన పెయింటింగ్ పనులు చేపట్టి, ప్లానిటోరియం హాల్ చుట్టూ ఉన్న వరండాలో కొంత భాగం లైబ్రరీ బుక్స్ ఏర్పాటు చేయునట్లుగా చూడాలని అన్నారు. అదే విధంగా గాంధీ హిల్ అభివృద్ధి కి సంబందించిన అంచనాలను రూపొందించాలని, కాంపౌండ్ వాల్ నందలి గ్యాప్ ఫిల్లింగ్ పనులు చేపట్టాలని అన్నారు. కొండ పై భాగములోని జాయ్ ట్రైన్ ట్రాక్ మరమ్మత్తుల పనులు నిర్వహించాలని పేర్కొన్నారు.
తదుపరి కాళేశ్వరరావు మార్కెట్ వద్ద లో బ్రిడ్జి లో పల్లముగా ఉండుట వల్ల కాలువ నందలి నీరు నిల్చియుండకుండా వాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కు సంబందించిన ఎయిర్ టెక్ వాహనములకు కలర్ కోడ్ ప్రకారం పెయింటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి. సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్ మరియు గాంధీ హిల్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News